రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలకు హైకోర్టులో ఊరట
టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు డివిజన్ బెంచ్….టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ2 చిత్రాలకే పరిమితం చేసింది. టికెట్ దరల పెంపు కోరుతూ సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది..
టికెట్ ధరల పెంపు , ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు పెట్టుకున్న వినతులను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు.
టికెట్ ధర పెంచకపోతే..
నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదు అని ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు, గతంలో కొన్ని చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఈ సినిమాలకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం జరిగిన విచారణలో నిర్మాతలకు బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ధరల నియంత్రణ ఉత్తర్వులు కేవలం పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకు మాత్రమే పరిమితమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959