తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..!

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మెదక్‌, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఆదిలాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 7.7 డిగ్రీల సెల్సియస్‌, పటాన్‌చెరులో 9 డిగ్రీలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
మరో కొన్ని రోజులు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు చలిగాలుల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959