భారత్- న్యూజిలాండ్ జట్లు తొలి వన్డే కోసం ముమ్మరంగా సిద్ధమవుతున్న వేళ టీమ్ ఇండియాలో ఆందోళన మొదలైంది. ప్రాక్టీస్ సమయంలో భారత స్టార్ ఆటగాడు గాయపడటంతో అతడిని మైదానం వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది…ఇప్పటికే తిలక్ వర్మ గాయంతో దూరం కాగా.. ఇప్పుడు ఫామ్‌లో ఉన్న మరో కీలక ఆటగాడు గాయపడటం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు తలనొప్పిగా మారింది.
నెట్స్‌లో గాయపడ్డ రిషబ్ పంత్
టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డారు. గాయం తీవ్రత దృష్ట్యా ఫిజియోలు అతడిని వెంటనే మైదానం నుండి తీసుకెళ్లారు. పంత్ గాయం ఎంత తీవ్రమైనదనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు…ప్రస్తుతానికి వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ప్రాధాన్యతగా ఉండగా పంత్ బ్యాకప్‌గా జట్టులో ఉన్నారు. అయితే ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ (2025-26)లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్, తుది జట్టులో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఈ గాయం అతడి అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. పంత్ గాయం పెద్దది కాకూడదని, రేపటి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు…
భారత జట్టు
రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జనవరి 11న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్‌లలో చేస్తారు. జియోహోట్స్టార్ (Jio Hotstar) యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959.