నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 12 – 01 – 2026,
వారం … ఇందవాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *నవమి* మ1.58 వరకు
నక్షత్రం : *స్వాతి* రా10.35 వరకు
యోగం : *ధృతి* రా8.08 వరకు
కరణం : *గరజి* మ1.58 వరకు
తదుపరి *వణిజ* రా2.57 వరకు,

వర్జ్యం : *తె.వ4.45 – 6.31*
దుర్ముహూర్తము : *మ12.30 – 1.14*
మరల *మ2.42 – 3.26*
అమృతకాలం : *మ12.59 – 2.44*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండం : *ఉ10.30 – 12.00*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *తుల*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.39,

*_నేటి పాశురం_*

*తిరుప్పావై –28వ పాశురము*

*క ఱవైగళ్ పిన్ శెన్రు కానమ్ శేర్ న్దుణ్బోమ్,*
*అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై*
*ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్*
*కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు*
*ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు*
*అఱియాద పిల్లెగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై*
*చ్చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే*
*ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.*

*తాత్పర్యము:-*

పశువులవెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించియుండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానము లేని మా గోపవంశమును మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము.
మాకెన్ని లోపము ఉన్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు .
గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు, లోకమర్యాద నెరుంగని పిల్లలము, అందుచే ప్రేమవలన నిన్ను చిన్నపేరుపెట్టి పిలిచినాము, దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక యుండకుము, మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము.

*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959