మూడ్రోజుల పండుగ. మామూలురోజుల సంగతేమోగానీ ఈ పండక్కి ప్లేట్లో ముక్క పడాల్సిందే. డిమాండ్ పెరగటంతో సంక్రాంతికి నాలుగైదు రోజులముందే చికెన్, మటన్ రేట్లు అమాంతం కొండెక్కాయి. గోదావరి జిల్లాల్లో కాస్త తక్కువ రేటుకే దొరికే చేపలకు కూడా డిమాండ్ పెరిగింది. టూస్టేట్స్లో నాన్వెజ్ రేట్లు అదరగొట్టేస్తున్నాయి..
చికెన్.. మటన్ రేటు..
ఆంధ్రా తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో చికెన్ ధర కొండెక్కింది. మటన్ ధర మంటపుట్టిస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే కిలోకి 70నుంచి 100 రూపాయలదాకా పెరిగింది చికెన్ ధర. కేజీ స్కిన్లెన్ చికెన్ 305 నుంచి 320దాకా ఉంది. హైదరాబాద్ లో ఏకంగా 360 రూపాయల వరకు పెరిగింది.. దాదాపు అన్ని ప్రాంతాల్లో 300 ల నుంచి 350 వరకు చికెన్ ధరలు ఉన్నాయి..
ధర..
నాటుకోడి ధర రికార్డు స్థాయిలో రూ. 2 వేల నుండి రూ. 2,500 వరకు పలుకుతున్నాయి. మటన్ ధర రూ. 800 ఉండగా.. నాటుకోడి ధర దాన్ని మించిపోవడం గమనార్హం. ఉత్పత్తి తగ్గడం, పెంపకం చేసే రైతుల సంఖ్య పరిమితంగా ఉండటం.పందెం పుంజులు, మేలు రకం నాటుకోళ్ల ధర కేజీ రూ. 2,000 నుండి రూ. 2,500 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో పందాలకు ఉపయోగించే కోళ్లకు ఇంకా ఎక్కువ ధర లభిస్తోంది. నాటుకోడి ధర రూ. 600 నుండి రూ. 1,000 వరకు విక్రయిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పందెం పుంజుల కంటే రుచి పరంగా పిట్టలకే ఎక్కువ గిరాకీ ఉంటోంది. అందుకే చాలా చోట్ల కోడి పిట్టల కొనుగోలుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు
పండక్కి బంధుమిత్రుల రాకపోకటంతో విందులు వినోదాలకోసం నాన్వెజ్ వండాల్సిందే. దీంతో రేటు ఎక్కువైనా రాజీపడటం లేదెవరూ. చికెన్, మటన్ పోటీలుపడి పెరుగుతుంటే.. చేసింది ఏమి లేక కొన్నాక తప్పని పరిస్థితి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పొట్టేళ్లు, నాటు కోళ్ళ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వారాంతపు సంతలకుతోడు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక సంతలు కూడా కొనసాగుతున్నాయి. కిందటేడాదితో పోలిస్తే పొట్టేళ్లు, నాటు కోళ్ల ధరలు భారీగా పెరిగాయంటున్నారు కొనుగోలుదారులు..
మటన్ కిలో 900పలుకుతుంది…
సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది.. ప్రస్తుతం మటన్ ధర కేజీ రూ. 800 నుండి రూ. 900 ఉండగా..
పండగపుట ఏమి కోనేటూ లేదు.. ఏమి తినేటు లేదు అంటూ తిట్టుకుంటూ వచ్చిన చుట్టాలకు వండి పెడుతూ అలా పండుగ చేసుకుంటున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959