మధురై జల్లికట్టు పోటీల్లో 52 మందికి గాయాలు.. 10 మంది పరిస్థితి విషమం.. గాయపడిన వారిలో 27 మంది ఎద్దుల పోరాట యోధులు.. 20 మంది ఎద్దుల యజమానులు, ఏడుగురు ప్రేక్షకులకు గాయాలు…
వందలాది ఎద్దులు ముందుకు దూసుకుపోయాయి. వాటిని లొంగదీసుకోవడానికి యువకులు నానా తంటాలు పడ్డారు. ఈ పోటీలో అపశృతి చోటుచేసుకుంది. ఈ పోటీల్లో 52మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో ఎద్దుల పోరాట యోధులు27, వాటి యజమానులు 20, ప్రేక్షకులు ఏడుగురు ఉన్నట్లు నిర్వహకులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.