త్వరలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముగ్దమ్ నగర్, మట్టపల్లి కి రాక..!

రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ మండలంలోని ముగ్దమ్ నగర్ లో అగ్రికల్చర్ కాలేజీ కీ శంకుస్థాపన చేయు ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం పరిశీలించారు…

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
త్వరలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముగ్దమ్ నగర్ లో 126.కోట్ల రూపాయలతో 100 ఎకరాలలో నిర్మించనున్న అగ్రికల్చర్ కాలేజికీ శంకుస్థాపన చేయు శిలాఫలకం ప్రదేశాన్ని పరిశీలించి చదును చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు…తదుపరి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూర్యాపేట జిల్లా,మఠం పల్లి మండలం,
మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి రానున్నందున రాష్ట్ర గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

శనివారం ఆయన జిల్లా ఎస్ పి కె నరసింహ తో కలిసి మట్టపల్లి లో గవర్నర్ రాక ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్ర గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవస్థానాన్ని పూలతో అందంగా అలంకరించాలని, గవర్నర్ దంపతులు గర్భగుడిలో పూజలు చేయుటకు తగిన ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను, ధర్మకర్తలను ఆదేశించారు.

మట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్లు, కాలువలు, నది పరివాహక ప్రాంతం పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాలని,
రోడ్ల పై ఎక్కడైనా గుంతలు లేకుండా వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, అవసరం ఉన్న చోట అప్రోచ్ రోడ్లు నిర్మించాలని, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండడమే కాకుండా, అత్యవసర మందులు,అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, గవర్నరు విశ్రాంతి తీసుకొనుటగాను గెస్ట్ హౌస్ శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలని, గ్రీన్ కార్పెట్లు, రెడ్ కార్పెట్లు పరవాలని, పూల మొక్కలతో దేవాలయాన్ని అందంగా అలంకరించాలని ఆదేశించారు.

పోలీస్ శాఖ హెలి ప్యాడ్, పార్కింగ్, ట్రాఫిక్,బందోబస్తు చూసుకోవాలని అలాగే వ్యవసాయ శాఖ, డి ఆర్ డి ఏ తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆదేశించారు.
చివరిగా కలెక్టర్, ఎస్ పి లకు వేదపండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు…

ఈ కార్యక్రమం లో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, తాసిల్దారులు కవిత,మంగా, డీఈవో శ్రీధర్ రెడ్డి, ఇంచార్జ్ డి ఆర్ డి ఏ పి డి శిరీష, ఆర్ &బి, డి ఇ సీతారామయ్య, జిల్లా వైద్య అధికారి, డి పి ఓ యాదగిరి డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు,విజయ్ కుమార్, ఈవో జ్యోతి, జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.