బంగ్లాదేశ్‌లో కారుతో తొక్కించి..మరో హిందువు హత్య..

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య జరిగింది. ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తోన్న హిందూ యువకుడు రిపాన్‌ సాహా(30) పెట్రోల్‌కు డబ్బు చెల్లించకుండా వెళ్లిపోతోన్న వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా…అతడిని వాహనంతో ఢీకొట్టి వెళ్లిపోయినట్లు బంగ్లా పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆ దేశంలో హిందువులపై జరుగుతోన్న మత పరమైన హింసాకాండలో భాగమేనా.. కాదా.. అన్న విషయం స్పష్టం కాలేదు.

దీనిపై హత్య కేసు నమోదు చేస్తున్నట్లు రాజ్‌బరి జిల్లా సదర్‌ పోలీసు చీఫ్‌ ఖొండాకర్‌ జియాఉర్‌ రహ్మాన్‌ స్థానిక మీడియాకు తెలిపారు. హతుడు డబ్బు చెల్లించకుండా వెళ్లిపోతోన్న వాహనానికి అడ్డు నిలబడగా.. అతడిని వాహనంతో తొక్కించి నిందితులు పరారయ్యారని ఆయన పేర్కొన్నారు. బాధితుడు అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని గుర్తించి.. సీజ్‌ చేసి, దాని యజమాని అబుల్‌ హషీం(55), డ్రైవర్‌ కమాల్‌ హొసేన్‌(43)లను అరెస్టు చేశారు..

స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందితుడు అబుల్ హషేమ్తో పాటు అతడి కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బంగ్లాదేశ్లో గత మూడు వారాల వ్యవధిలోనే దాదాపు 10 మంది హిందువులు హత్యకు గురికావడం గమనార్హం. రాజకీయ అస్థిరతను అడ్డుపెట్టుకుని మైనారిటీల ఆస్తులను లూటీ చేయడం, ప్రాణాలు తీయడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తున్నా, అక్కడ హిందువుల భద్రత ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఈ తాజా హత్యతో స్థానిక హిందూ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959