తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త..!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టినవారికి డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు లబ్దిదారుల అకౌంట్లో నేరుగా వీటిని జమ చేసింది. ఏకంగా రాష్ట్రంలోని 23 వేల మంది అకౌంట్లోకి డబ్బులు వేసింది. వీరి అకౌంట్లోకి దాదాపు రూ.262.51 కోట్లను తాజాగా విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఒకేరోజు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయడం రికార్డ్‌గా చెబుతున్నారు. ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో ఒకేరోజు నిధులు విడుదల చేయలేదు. ఆధార్ అనుసంధానం ద్వారా వీటిని లబ్దిదారుల అకౌంట్లోకి విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్నవారు, నిర్మించుకుంటున్నవారికి రూ.4,351 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది..

సోమవారం కొంతమంది లబ్దిదారులకు అందించగా.. మంగళవారం మరికొంతమంది అకౌంట్లో నిధులు జమ చేసింది. ఈ రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో రూ.262.51 కోట్లు అందించింది. ఆధార్ నెంబర్ ఆధారంగా పారదర్శకంగా చెల్లింపులు చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. రెండు రోజుల్లో సుమారు 23 వేల మందికి లబ్ది చేకూర్చినట్లు స్పష్టం చేసింది. ప్రతీ సోమవారం లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నామని, దీని వల్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చేస్తున్నట్లు తెలిపింది. జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లను పర్యవేక్షిస్తున్నారని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం నిజమైన లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనం జరిగేలా చేస్తున్నారు…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959