సూర్యాపేట జిల్లా…నేరేడుచర్ల మండల కేంద్రంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి….
స్థానికంగా ఉన్న రామాలయం గుడి వద్ద నుండి మెయిన్ రోడ్డు మొత్తం కూడా బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేయడం జరిగింది…
అనంతరం ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ…
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయటం ఖాయమని అన్నారు…
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓటు వేయమని వస్తే,, ప్రజలకు బాకీ ఉన్న కార్డులను చూపించాలని అన్నారు….
వికలాంగుల పింఛన్ పెంపు పైసలు,, ఆడబిడ్డలకు 2500,, స్టూడెంట్స్ కి స్కూటీ.. గ్యాస్ సబ్సిడీ పైసలు.. ఇలా ఒక్కొక్కరికి లెక్కేస్తే 60 వేల రూపాయల వరకు ఇవ్వాల్సి వస్తుందని వాటన్నిటిని ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని తెలపాలని అన్నారు..
ప్రశ్నించే బిఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలి,, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని అన్నారు..
గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు మున్సిపాలిటీలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న మున్సిపాలిటీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు..
బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలంటూ , చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు…
బిఆర్ఎస్ పార్టీ దిమ్మెను టచ్ చేసి చూడు ,, పాతాళానికి పోతావు అని హెచ్చరించారు…
ఓ సీఎం అయిన తర్వాత అయినా ఆ భాష మార్చుకోకపోతే ఎవరు నిన్ను సీఎంగా స్వీకరించరు అని తెలిపారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ ఎన్ రెడ్డి, అప్పిరెడ్డి, శ్రీధర్ బాబు, సురేష్ బాబు, సాయి, వెంకటరెడ్డి, జయబాబు,, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959