మూడో టీ20లో భారత్‌ ఘన విజయం… సిరీస్‌ కైవసం..

: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడవ టి20లో సూర్య కుమార్ యాదవ్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఊచకోత కోశారు. ఈ దెబ్బకు 10 ఓవర్లలోనే మ్యాచ్ ఫినీష్‌ అయింది. దీంతో మూడవ టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. న్యూజిలాండ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు నష్టపోయి టీమ్ ఇండియా చేదించింది. ఈ దెబ్బకు 5.. T20 ల సిరీస్ ను 3-0 తేడాతో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్ టీమిండియా దక్కించుకున్న నేపథ్యంలో, న్యూజిలాండ్ పై ప్రతి కారం తీర్చుకున్నట్లు అయింది.. ..

10 ఓవ‌ర్ల‌లోనూ మ్యాచ్ ఫినీష్‌.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు టీమిండియా అద్భుతం చేసింది. సూర్య కుమార్ యాదవ్ సేన ఆధ్వర్యంలోని టీమిండియా జట్టు, న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ గెలుచుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య గౌహతి వేదికగా ఆదివారం రోజున మూడవ టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొదట బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ జట్టులో గ్లైన్ ఫిలిప్స్ ఒక్కడే 48 పరుగులు సాధించగా, మార్క్ చాప్ మన్ 32 పరుగులు చేశాడు. కెప్టెన్ సాంటన్నర్ మరోసారి 27 పరుగులతో రాణించాడు.

ఇక న్యూజిలాండ్ ఫిక్స్ చేసిన 154 పరుగుల లక్ష్యాన్ని భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా అవలీలగా చేదించింది. కేవలం 10 ఓవర్లు వాడిన టీమిండియా లక్ష్యాన్ని చేదించేసింది. 10 ఓవర్లు ఆడిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి మ్యాచ్ గెలిచింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది టీమ్ ఇండియా. ఈ విజయంతో 5 T20 ల సిరీస్ కూడా కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలుచుకోగా.. ఇప్పుడు టి20 సిరీస్ టీమిండియా వశం అయింది.

14 బంతుల్లో అభిషేక్ శర్మ అర్థ సెంచరీ..
న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టి20 లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) చరిత్ర సృష్టించాడు. టి20 అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరఫున తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసిన రెండవ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. తన గురువు యువరాజు సింగ్ 12 బంతుల్లో ఇంగ్లాండ్ పై అర్థ సెంచరీ సాధించాడు. ఇప్పుడు న్యూజిలాండ్ పైన 14 బంతుల్లోనే అభిషేక్ శర్మ అర్థ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన రికార్డు ఉంది..

కివీస్‌ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికే తంటాలు పడ్డ పిచ్‌పై ఛేదనలో భారత జట్టు తొలి బంతికే సంజూ శాంసన్‌ వికెట్‌ కోల్పోయినా అభిషేక్‌, గత మ్యాచ్‌ హీరో ఇషాన్‌ కిషన్‌ (28) విధ్వంసంతో లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ దంచేసింది. కిషన్‌ వస్తూనే 6, 6, 4తో ఛేదనను ప్రారంభించగా అభిషేక్‌ రెండో ఓవర్లో 6, 4, 4తో డఫ్ఫీకి స్వాగతం పలికాడు. తర్వాతి ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ బాదిన అతడు ఇషాన్‌ ఔట్‌ అయినా దంచుడు ఆపలేదు. దీంతో 5 ఓవర్లకే భారత్‌ సగం లక్ష్యాన్ని (72/2) ఊదేసింది.

ఇక సూర్య రాకతో బంతి ఫీల్డర్లు, బౌలర్ల చేతిలో కంటే బౌండరీ లైన్‌ ఆవలే ఎక్కువసేపు ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డఫ్ఫీ ఆరో ఓవర్లో రెండు బౌండరీలు, సిక్స్‌తో 14 బంతుల్లోనే అభిషేక్‌ ఫిఫ్టీ పూర్తిచేశాడు. భారత్‌ తరఫున ఇది రెండో వేగవంతమైన అర్ధ శతకం (మొదటిది యువరాజ్‌ సింగ్‌-12 బంతుల్లో 2007 ఇంగ్లండ్‌పై). పవర్‌ ప్లేలోనే భారత్‌ 94/2తో నిలిచింది. సూర్య కూడా లయ అందుకోగానే బౌండరీలతో విరుచుకుపడటంతో ఛేదన మరింత తేలికైంది. ఫిలిప్స్‌ వేసిన పదో ఓవర్లో 6, 4తో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ చేసిన కెప్టెన్‌.. ఆఖరి బంతిని బౌండరీగా మలిచి లాంఛనాన్ని పూర్తిచేశాడు.

సంక్షిప్త స్కోర్లు.

న్యూజిలాండ్‌: 20 ఓవర్లలో 153/9 (ఫిలిప్స్‌ 48, చాప్‌మన్‌ 32, బుమ్రా 3/17, బిష్ణోయ్‌ 2/18);

భారత్‌: 10 ఓవర్లలో 155/2 (అభిషేక్‌ 68*, సూర్య 57*, హెన్రీ 1/28, సోధి 1/28).