అమరావతి రెండో దశ విస్తరణకు 1,75,347 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్
రెండో దశ ప్లాన్లో 50 గ్రామాలు
ప్రస్తుతం 7 గ్రామాల్లోని 20,494 ఎకరాల్లో భూసేకరణ….
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపొందనున్నట్టు సీఆర్డీఏ అధికారులు ప్రకటించారు. ఇది 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది, ఇందులో 50 గ్రామాలు (ప్రస్తుత భూసమీకరణలోని 7 గ్రామాలతో సహా మిగిలిన 43 గ్రామాలు) ఉన్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రహదారులు, మౌలిక వసతులు అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ ప్లాన్ సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రణాళిక పట్ల గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 1,75,347 ఎకరాల భూమి ప్రభావితమవుతుందని, అందులో గుంటూరు జిల్లాలో 29, పల్నాడు జిల్లాలో 14 గ్రామాలు ఉన్నాయని అధికారిక సమాచారం చెబుతోంది. కానీ ఈ మాస్టర్ ప్లాన్ వెనుక దాగిన సమస్యలు, విమర్శలు ఎన్నో. ఇది నిజంగా సుస్థిర అభివృద్ధికా లేక రైతుల భూముల దోపిడీకి మరో మార్గమా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి…