బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్…బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు లేఖలో ప్రకటన..!.

బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్..

బీజేపీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన ఆరూరి రమేష్

తన ఇంటి పార్టీ బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు లేఖలో ప్రకటించిన ఆరూరి రమేష్…

వరంగల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి తన సొంత గూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆయన, త్వరలోనే భారత రాష్ట్ర సమితి (BRS) తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరూరి రమేష్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత అనూహ్యంగా బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ.. ఆయనకు విజయం దక్కలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన, చివరకు కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు.