విశాఖ ఉత్సవ్ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది.
విశాఖ ఉత్సవ్ కార్యక్రమాలు నెల 24 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఇది జరగనుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వ్యయంతో నిర్వహిస్తుంది. శ్రేయాస్ మీడియా అనే ప్రైవేట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అయితే విశాఖ ఉత్సవ్ లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక పైకి మంత్రులు రావడంతో నగర మేయర్ పీలా శ్రీనివాస్ ను పక్క సీటులో కూర్చోమని కలెక్టర్ హరిందర్ ప్రసాద్ కోరారు. దీంతో మేయర్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు..
విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ఈ నెల 24 నుంచి మొదలైన సంగతి తెలిసిందే.
మొత్తం తొమ్మిది రోజుల పాటు ఇది జరగనుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. శ్రేయాస్ మీడియా అనే ప్రైవేట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అయితే విశాఖ ఉత్సవ్‌లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక పైకి మంత్రులు రావడంతో నగర మేయర్ పీలా శ్రీనివాస్‌ను పక్క సీటులో కూర్చోమని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. దీంతో మేయర్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. అలిగి అక్కడ నుంచి వెళ్లేందుకు మేయర్ సిద్ధమవడంతో.. కలెక్టర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా మేయర్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఇక మంత్రులు వంగలపూడి అనిత, దుర్గేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఆయనను వేదికపైనే ఉండాలని కోరారు. ఎవరిమాట వినకుండా మేయర్ అలిగి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959