యూనివర్సిటీలో విద్యార్థిగా మారినా సీఎం రేవంత్ రెడ్డి..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి. వాట్సాప్..+91 91330 57959
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా మారి తన శిక్షణను ప్రారంభించారు…మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ప్రఖ్యాత కెనెడీ స్కూల్లో “21వ శతాబ్దంలో నాయకత్వం” (Leadership in the 21st Century) అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు ఆయన హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు “అధికార విశ్లేషణ – నాయకత్వం” అనే అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటలకే తరగతులు ప్రారంభం కాగా, కేస్ అనాలిసిస్, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి అంశాల్లో సీఎం చురుగ్గా పాల్గొంటున్నారు. సుమారు సాయంత్రం 6 గంటల వరకు ఈ మేధోమథన తరగతులు కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రి పర్యటిస్తున్న బోస్టన్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాతావరణం అత్యంత కఠినంగా ఉంది. ‘ఫెర్న్’ (Fern) అనే భారీ మంచు తుఫాను కారణంగా ఆ ప్రాంతమంతా శీతాకాల అత్యవసర పరిస్థితి నెలకొంది. సుమారు రెండు అడుగుల మేర (24 ఇంచులు) భారీగా మంచు కురవడంతో పాటు, ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిర్ణీత సమయానికి తరగతులకు హాజరవుతూ తన నిబద్ధతను చాటుకుంటున్నారు. ప్రపంచ స్థాయి నాయకత్వ మెళకువలను నేర్చుకోవాలనే ఆయన ఉత్సాహంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయి పరిపాలనా పద్ధతులను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ కోర్సును ఎంచుకున్నారు అంటు వారి అనుచరులు తెలుపుతున్నారు… వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, మేధావులతో కలిసి ఆయన ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ శిక్షణ అనంతరం రేవంత్ రెడ్డి మరిన్ని నూతన సంస్కరణలతో రాష్ట్ర పాలనను పరుగులు తీయిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి విద్యార్థిగా మారడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.వాట్సాప్..+91 91330 57959