హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం .

రూ.1,69,500
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

రూ.1,56,950
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,77,600…

అంతర్జాతీయ అనిశ్చితులు ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు లేకపోవడంతో బంగారం, వెండి ధరలు రోజుకో జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేస్తున్నాయి. తాజాగా నేడు (జనవరి 28) పసిడి ధర ఏకంగా రూ.8 వేల పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,70,447ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగి రూ.1,51,400ల గరిష్ఠాన్ని తాకింది. ఇక నగరంలో కిలో వెండి ధర కూడా ప్రస్తుతం రూ.3.75 లక్షల వద్ద తచ్చాడుతోంది (Gold, Silver.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 5,296 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఔన్స్ వెండి ధర కూడా 114 డాలర్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు డాలర్ బలహీనపడటం కూడా ఈ లోహాల ధరలకు ఆజ్యం పోస్తున్నాయి…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.