ఇరాన్‌లో అజిత్ డోభాల్ దూత వ్యూహాత్మక మిషన్.!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ ప్రతినిధి అడుగుపెట్టడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ముఖ్యమైన అప్‌డేట్స్:

భారత దౌత్యం: అజిత్ డోభాల్ దూత, డిప్యూటీ ఎన్ఎస్‌ఏ (Deputy NSA) పవన్ కపూర్, టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు మరియు వ్యూహకర్తగా పేరున్న వ్యక్తితో కీలక సమావేశం నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు మంచి మిత్రుడైనప్పటికీ, భారత్ ఈ ఉద్రిక్త సమయాల్లో ఇరాన్‌తో చర్చలు జరపడం చాలా కీలకంగా మారింది.
అమెరికా ‘న్యూక్ స్నిఫర్’ విమానం: అమెరికాకు చెందిన WC-135R కాన్‌స్టెంట్ ఫినిక్స్ (Constant Phoenix) విమానం నెబ్రాస్కాలోని వ్యూహాత్మక ఎయిర్‌బేస్ నుండి మిడిల్ ఈస్ట్ వైపు బయలుదేరింది. ఈ విమానాన్ని “న్యూక్లియర్ స్నిఫర్” అని పిలుస్తారు. ఇది వాతావరణంలో రేడియోధార్మికతను గుర్తించడం ద్వారా ఏదైనా దేశం అణు పరీక్షలు చేస్తోందా లేదా అనేది కనిపెడుతుంది..

అణు ముప్పు అనుమానాలు: ఇరాన్ రహస్యంగా అణు బాంబును తయారు చేస్తోందనే అనుమానం అమెరికాకు బలంగా ఉంది. అందుకే ఈ విమానాన్ని పంపినట్లు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు..

సుప్రీం లీడర్ ప్రత్యక్షం: కొద్ది రోజులుగా బంకర్‌లో దాక్కున్నారని ప్రచారం జరిగిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, తాజాగా బహిరంగంగా కనిపించి ఆ పుకార్లకు చెక్ పెట్టారు..

వ్యూహాత్మక విశ్లేషణ:

అమెరికా తన USS అబ్రహం లింకన్ యుద్ధ నౌకల సముదాయాన్ని ఇరాన్ వైపు పంపుతూ ఒత్తిడి పెంచుతోంది. డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తన ప్రతినిధిని పంపడం వెనుక యుద్ధాన్ని నివారించడం లేదా ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడం వంటి వ్యూహాలు ఉండవచ్చని సమాచారం..