యూనియన్ బడ్జెట్ 2026-27.. ధరలు తగ్గేవి ఇవే..!

యూనియన్ బడ్జెట్ 2026-27..

తగ్గనున్న ధరలు..

తగ్గనున్న సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు

బీడీలు, బ్యాటరీలపై తగ్గనున్న రేట్లు

CNG, బయోగ్యాస్, క్యాన్సర్ మందుల ధరలు తగ్గింపు..

AIకి ప్రోత్సాహకం.. 2047 దిశగా అడుగులు: నిర్మల

న్యూఇండియాకు AI క్వాంటమ్: నిర్మల

భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు సంస్థలకు ప్రోత్సాహకం: నిర్మల

2047 వరకు డేటా సెంటర్ల ఏర్పాటు సంస్థలకు ట్యాక్స్ హాలిడే: నిర్మల

ట్యాక్స్ హాలిడేతో క్లౌడ్ సేవల సంస్థలకు ప్రయోజనం: నిర్మల.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రేపు తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. వికసిత్‌ భారత్‌ థీమ్‌గా బడ్జెట్‌ ఉండనుంది. బడ్జెట్‌లో ఏయే రంగాలపై ఫోకస్‌ ఉంటుంది. వేటికి పెద్దపీట వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ద్రవ్య లోటుకు కళ్లెం వేయడంతో పాటు..క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ను గణనీయంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రైల్వే, రహదారులు, డిఫెన్స్‌, మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌లో మౌలిక సదుపాయల కోసం భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని సమాచారం..

చిన్న మదుపరుల కోసం మోదీ సర్కార్ కీలక నిర్ణయం..

కార్పొరేట్ బై బ్యాక్ కొనుగోళ్ల పైన 22 శాతం ట్యాక్స్..

నాన్ కార్పొరేట్ బై బ్యాక్ కొనుగోళ్లపైన 30 శాతం ట్యాక్స్..

🔸 కేంద్ర బడ్జెట్ 2026 కింద,ఆర్థిక మంత్రి 2027 ఆర్థిక సంవత్సరానికి ₹12.2 ట్రిలియన్ల భారీ మౌలిక సదుపాయాల వ్యయం కోసం ప్రణాళికలను ప్రకటించారు, ఇది మూలధన ఆధారిత వృద్ధిపై ప్రభుత్వం యొక్క బలమైన దృష్టిని బలోపేతం చేస్తుంది.

🔸 ప్రతిపాదిత వ్యయం రోడ్లు, రైల్వేలు, పట్టణ మౌలిక సదుపాయాలు, విద్యుత్ మరియు పారిశ్రామిక అభివృద్ధి అంతటా ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

🔸 లార్సెన్ & టూబ్రో వంటి మౌలిక సదుపాయాల ప్రధాన సంస్థలు స్థిరమైన ప్రభుత్వ నాయకత్వ పెట్టుబడి యొక్క కీలక లబ్ధిదారులుగా దృష్టిలో ఉంచుకునే అవకాశం ఉంది.

🔸 ₹12.2 ట్రిలియన్ల మౌలిక సదుపాయాల వ్యయం మూలధన ఆధారిత వృద్ధికి నిరంతర నిబద్ధతను నొక్కి చెబుతుంది, మౌలిక సదుపాయాల కంపెనీలకు దీర్ఘకాలిక దృశ్యమానతను అందిస్తుంది…

విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. భారత స్టాక్‌ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు. పార్లమెంటులో ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్‌ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. మౌలిక వసతుల కోసం రూ.12.2లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు..వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లక్ష ఏహెచ్‌పీలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో దేశీయ జలరవాణాలో ఆధునిక విధానాలు తీసుకొస్తున్నామని చెప్పారు. వికసిత్‌ భారత్‌ కోసం బ్యాంకింగ్‌ రంగంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీ ప్లేన్‌ తయారీ రంగం కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈల కోసం కార్పొరేట్‌ మిత్ర కార్యక్రమం తీసుకొస్తున్నామని అన్నారు. సేవారంగంలో విద్య, ఉద్యోగ అవకాశాల వృద్ధికి ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు…

క్యాపిటల్ మార్కెట్ల విషయంలో ప్రభుత్వం కాస్త కట్టుదిట్టైన వైఖరిని ప్రదర్శించింది. షేర్ బైబ్యాక్ పన్ను, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT), ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ (TCS)లో ప్రతిపాదించిన మార్పుల వల్ల ట్రేడింగ్ వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పన్ను ఎస్కేప్‌కు అడ్డుకట్ట వేయడం, పన్ను అనుసరణను బలోపేతం చేయడమే ఈ చర్యల వెనుక ఉన్న లక్ష్యంగా నిపుణులు అంచనా వేస్తున్నారు…

బడ్జెట్‌పై స్పందించిన బజాజ్ బ్రోకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మనిష్ జైన్.. తక్షణ లాభాల కంటే మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచడంపైనే ఈ బడ్జెట్‌ దృష్టి పెట్టిందన్నారు. ఆర్థిక లోటు నియంత్రణకు ముందుకెళ్లే ప్లాన్ స్పష్టంగా ఉండటంతో రూ.12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ హామీ, తయారీ రంగంపై నిరంతర దృష్టి భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకొస్తాయని తెలిపారు..

మౌలిక వసతులు, సెమీకండక్టర్లు, బయో-ఫార్మా, వ్యూహాత్మక తయారీ వంటి రంగాలపై ఫోకస్‌ పెట్టడం ద్వారా పెట్టుబడి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని విభాగాల్లో లావాదేవీ ఖర్చులు పెరిగినా, విధానాల కొనసాగింపు, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాల వృద్ధిపై స్పష్టత వంటి అంశాలే పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రధాన ఆధారమవుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఏవి చౌకయ్యాయి?

1. వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసుకునే వస్తువులు

2. క్యాన్సర్ రోగులకు ఉపయోగించే 17 రకాల ఔషధాలు

3. 7 అరుదైన వ్యాధులకు మందులు, ప్రత్యేక వైద్య ఆహారం (FSMP)

4. లెదర్ ఉత్పత్తులు (ఫుట్‌వేర్)

5. టెక్స్‌టైల్ వస్త్రాలు

6. సీ ఫుడ్ ఉత్పత్తులు

7. విదేశీ టూర్ ప్యాకేజీలు

8. బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్

9. సోలార్ గ్లాస్

10. కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్)

11. బయోగ్యాస్ మిశ్రమ సీఎన్‌జీ

12. విమాన తయారీకి అవసరమైన విడిభాగాలు

13. మైక్రోవేవ్ ఓవెన్

14. విదేశీ విద్య (ఫారిన్ ఎడ్యుకేషన్)

ఏవి ఖరీదయ్యాయి?

1. మద్యం

2. సిగరెట్లు

3. అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన భాగాలు

4. ఖనిజాలు, ఇనుప ధాతువు, బొగ్గు

5. ఆదాయపు పన్ను తప్పుదోవ పట్టించడం (మిస్‌రిపోర్టింగ్)

6. స్టాక్ ఆప్షన్లు, ఫ్యూచర్ ట్రేడింగ్

టూరిజానికి బూస్ట్…

సాహసయాత్రలు, పర్వత పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తూ హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ–కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పర్యావరణానికి హాని కలగకుండా పర్వత మార్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యాటక మౌలిక వసతులను విస్తరించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, తమిళనాడులోని పొతోగై మలై వంటి తూర్పు, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కూడా ఎకో–టూరిజం ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. స్థానిక ప్రకృతి సంపదను పరిరక్షిస్తూ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు సాగనున్నాయి.

మొత్తంగా ఈ బడ్జెట్ నిర్ణయాల ద్వారా పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టమవుతోంది.