ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇందులోభాగంగా, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు ఆదివారం విచారణకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నగరంలోని నంది నగర్ నివాసానికి చేరుకుంటారు. .మరోవైపు, ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్ వద్దకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కేసీఆర్‌పై అపవాదు పోవాలని కార్యకర్తలు అక్కడ గుమ్మడికాయలతో దిష్టి తీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రవల్లి నుంచి మరికొద్దిసేపట్లో కేసీఆర్ హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని నివాసంలో సిట్ అధికారులు ఆయన్ను విచారించనున్నారు.
కాగా, ఈ కేసులో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోనే విచారణ జరపాలంటూ కేసీఆర్ చేసిన వినతిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. దీంతో ఆయన హైదరాబాద్ నగరంలోని తన నివాసానికి రానున్నారు. మరోవైపు, ఇదే కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, కేటీఆర్‌లను కూడా సిట్ అధికారులు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ..
విచారణ సమయంలో కేసీఆర్‌తో ఒకరు మాత్రమే ఉండేందుకు సిట్ అధికారులు అనుమతినిచ్చారు. దీంతో న్యాయ సలహాల కోసం అడ్వకేట్ రాంచందర్‌రావును కేసీఆర్‌పాటు పాటు దర్యాప్తులో ఉండేందుకు వెసులుబాటు కల్పించారు…
ఎర్రవెల్లి నివాసంలో ఉన్న కేసీఆర్ సిట్ విచారణ కోసం ఇవాళ ఉదయం బయల్దేరి హైదరాబాద్‌కు వచ్చారు. ఎర్రవెల్లి నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్‌కు దారిపొడవునా జనాలు నీరాజనం పలికారు. అభిమానులు, ప్రజలు రోడ్డు పక్కన నిలబడి అభివాదం చేస్తూ సంఘీభావం తెలిపారు. కాన్వాయ్‌పై పూలు జల్లి తమ అభిమానం చాటుకున్నారు. నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతినిచ్చారు..