మున్సిపల్ ఎన్నికల్లో విజయపతాక ఎగురవేయాలి… కేసీఆర్..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు కేసీఆర్ సూచనలు..
రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయపతాక ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ముగిసిన అనంతరం తనను కలిసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందరినీ సమన్వయ పరచుకోవాలని సూచించారు. అధికార పార్టీ చేసే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్బోధించారు. పోలింగ్ రోజు కాంగ్రె స్ బల ప్రదర్శన చేసే అవకాశం ఉం టుందని, గులాబీ సేనలను అప్రమత్తంగా ఉంచాలని, అత్యధిక మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు..