వెనెజువెలా నుంచి భారత్ ఇంధనం దిగుమతి చేసుకుంటుంది : ట్రంప్.
డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్.. ఇకపై వెనెజువెలా నుంచి చేసుకునేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు..ఫ్లోరిడాకు వెళ్తున్న క్రమంలో.. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..
వెనెజువెలా నుంచి భారత్ (India) ఇంధనం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ చమురుకు బదులు వెనెజువెలా ఇంధనాన్ని (Venezuelan Oil) ఇండియా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. వెనెజువెలాతో ఇటీవలే ఓ డీల్ కుదుర్చుకున్నట్లు ట్రంప్ తెలిపారు..
”మేము ఇప్పటికే వెనెజువెలాతో ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇందులో భారత్ కూడా చేరనుంది. భారత్ ఇకపై వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం” అని ట్రంప్ తెలిపారు. అలాగే వెనెజువెలా చమురు కోసం చైనా కూడా తమతో చర్చలు జరిపే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. దాన్ని మేము స్వాగతిస్తామన్నారు. దీనిపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు వెనెజువెలాలో పాలనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఇప్పుడు తన అధీనంలోనే ఉందన్నారు. తాను కోరుకున్నట్లుగానే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అక్కడి చమురు నిల్వలు పూర్తిగా అమెరికా చేతికి వచ్చే వరకు ఆమెనే తాత్కాలిక నాయకురాలిగా కొనసాగుతారని తెలిపారు.
వెనెజువెలాపై సైనిక దాడి చేసి.. ఆ దేశ నేత నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
భారతదేశం ఒకప్పుడు వెనిజులా నుంచి లక్షల బ్యారెల్ల చమురు దిగుమతి చేసుకునేది. ఒనానొక టైం వచ్చేసరికి.. ఆ దేశం మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వరకు భారతదేశం వాటా కలిగి ఉండేది. అయితే, 2010 చివర్లో.. అమెరికా వెనెజువెలాపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ క్రమంలో.. ద్వితియ శ్రేణి ఆంక్షలు(Secondary Sanctions) భయంతో భారత్‌కు చెందిన కంపెనీలు కొనుగోళ్లను తగ్గించాయి, ఫలితంగా వెనిజులా చమురు దిగుమతులు గణనీయంగా పడిపోయాయి.
అదే సమయంలో.. అమెరికా ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఇంతకాలం భారత్ ఇరాన్ నుంచి కాస్తకూస్తో చమురు దిగుమతులను చేసుకునేది. అయితే ఈమధ్యే భారత ప్రధాని మోదీ – వెనెజువెలా అధ్యక్షురాలు రోడ్రిగ్జ్‌లు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులతో సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు కూడా…
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వాణిజ్యంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్న సంకేతాన్ని ట్రంప్ వినిపించారు. చమురు ఒప్పందం విషయంలో చైనాను స్వాగతిస్తున్నామని, ఆ దేశంతో డీల్ గొప్పగా ఉంటుందని, చైనాను స్వాగతిస్తామన్న విషయం తెలిసిందే అని, ఇప్పటికే కొన్ని డీల్స్ చేసుకున్నామని, ఇండియా కూడా వస్తోందని, ఆ దేశం వెనిజులా ఇంధనాన్ని కొనుగోలు చేయనున్నదని ట్రంప్ అన్నారు.
ఇరాన్‌కు బదులుగా వెనిజులా నుంచి భారత్ తన ఇంధనాన్ని ఖరీదు చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన రిపోర్టర్లతో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నామని, డీల్ కాన్సెప్ట్ తెలుసు అన్నారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి తగ్గినందుకు వల్ల.. వెనిజులా నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది…