జిల్లాలో ఈనెల 11వ తేదిన మున్సిపాలిటీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్, ఎన్నికల అనంతరం లెక్కింపుకు సంబంధించి లెక్కింపు కేంద్రాలను స్థానిక ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లెక్కింపు కేంద్రాల భద్రత ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పి నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లెక్కింపుకు సంబంధించిన అన్ని రకాల సామాగ్రిలను మునుముందుగా సమకూర్చాలని లెక్కింపుకు వచ్చే ఉద్యోగులు అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్ల చేయాలని కోరారు. భద్రతపరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని కౌంటింగ్ జరిగే పరిసరాల చుట్టూ పౌరుల సంచారం నిషిద్ధ ఆజ్ఞలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు , సూర్యాపేట, కోదాడ ఆర్డీవో లు వేణుమాధవ్, సూర్యనారాయణ డిఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమత్ రెడ్డి, సిఐ లు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.