అండర్-19 వన్డే ప్రపంచకప్ విజేతగా భారత జట్టు..

అండర్-19 వన్డే ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. ఎక్కడా ఇంగ్లాండ్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ప్రారంభం నుంచే పైచేయి సాధించారు. ఇంగ్లాండ్‌పై ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో ఆరోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుతున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (175) మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే అర్ధ శతకం(53)తో రాణించగా.. అభిజ్ఞాన్‌ కుందు(40), వేదాంత్‌ త్రివేది (32) పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జేమ్స్‌ మింటో 3, మోర్గాన్‌ 2, అలెక్స్‌ గ్రీన్‌ 2, మానీ ఒక వికెట్‌ తీశారు.412 పరుగుల భారీ లక్ష్య చేధనలో క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. ఓపెనర్ బెన్‌ డాకిన్స్‌ 66 పరుగులతో చెలరేగిపోయారు. ఆ తర్వాత బెన్‌ మేయెస్ 45, ఫాల్కనర్ 115 పరుగులు, థామస్ 31, జేమ్స్ మింటో 28 పరుగులు చేశారు. మొత్తంగా 40.2 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ 311 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అంబ్రీష్ మూడు, దేవేంద్రమ్, చౌహాన్ చెరో రెండు, పటేల్, ఆయూష్ తలో వికెట్ తీశారు..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్

412 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్.ఎస్. అంబ్రిస్ మూడు వికెట్లు పడగొట్టగా, కాలేబ్ ఫాల్క్‌నర్ 115 పరుగులు చేశాడు. ఒక ఎండ్‌ నుంచి దూకుడుగా ఆడాడు. కానీ, మరో ఎండ్‌లో వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. ఇది ఇంగ్లాండ్ ఓటమికి దారితీసింది.

సెంచరీతో దుమ్మురేపిన వైభవ్..

వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులకు అవుటయ్యాడు. 218.75 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (53 పరుగులు) అర్ధ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ కుందు 40, వేదాంత్ త్రివేది 32, విహాన్ మల్హోత్రా 30 పరుగులు చేశారు.