ప్రియుడితో గొడ‌వ‌..బిల్డింగ్ పైనుంచి దూకిన యువ‌తి..

ప్రియుడితో క‌లిసి ఢిల్లీలోని ఓ హోట‌ల్‌కు వ‌చ్చిన 22 ఏళ్ల యువ‌తి

పెళ్లి విష‌యంలో ఇద్ద‌రి మధ్య గొడ‌వ‌.. ఆగ్రహంతో కిందకు దూకిన యువ‌తి

4వ అంతస్తు పైనుంచి యువతి దూకడం గమనించి టీవీ, ఫ్రిజ్ కార్డ్‌బోర్డ్ బాక్స్‌ల‌ను అడ్డుగా పెట్టిన స్థానికులు

నేరుగా ఆ బాక్స్‌ల‌పై పడటంతో త‌ప్పిన ప్రాణాపాయం.. వీడియో వైర‌ల్‌..

ఢిల్లీ: ప్రియుడితో గొడ‌వ‌ పడి ఓ యువతి బిల్డింగ్ పైనుంచి దూకిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… 22 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి హోటల్ కు వచ్చింది. పెళ్లి విష‌యంలో ఇద్ద‌రి మధ్య గొడ‌వ‌ జరగడంతో ఆగ్రహంతో సదరు యువతి కిందకు దూకింది. 4వ అంతస్తు పైనుంచి యువతి దూకుతుండగా స్థానికులు గమనించి టివి, ఫ్రిజ్ కార్డ్‌బోర్డ్ బాక్స్‌ల‌ను అడ్డుగా పెట్టారు. నేరుగా ఆ బాక్స్‌ల‌పై పడటంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..