కాంగ్రెస్‌కి గూడెం మహిపాల్ రెడ్డి ఝలక్..!

పటాన్ చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కి మద్దతిచ్చి గెలిపించిన గూడెం

కాంగ్రెస్‌కి గూడెం భారీ షాక్ ..కనీసం ఒక్క మున్సిపాలిటీలో ఖాతా తెరవని అధికార పార్టీ..

గుమ్మడిదల, గడ్డపోతారం,ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలలో బీఆర్‌ఎస్‌ విజయం..

మున్సిపల్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన గూడెం..

కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని..నియోజకవర్గానికి పైసా లాభం లేదని కామెంట్లు..

ఘర్ వాపసీ కోసమే బీఆర్ఎస్‌ని గెలిపించిన గూడెం..త్వరలో కేసీఆర్ సమక్షంలో చేరిక..
గతంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జీఎమ్మార్ (GMR) ఫంక్షన్ హాల్లో జరిగిన అనుచరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కొన్ని పరిస్థితుల వల్ల తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరానని.. దానివల్ల కనీసం వెంట్రుక వంతు కూడా లాభం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ పట్ల కృతజ్ఞతగా.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లోని 104 మంది కౌన్సిలర్లను గెలిపించేలా విభాగాల వారీగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే..