తొర్రురు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో మోసం
లక్కీ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచిన వైనం
చిట్టీల సెలక్షన్ లో వెతుకులాడి మరీ కాంగ్రెస్ పార్టీ లావు చిట్టీ తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు
ఈ కుట్రలు పన్నటం కోసమే ఒక రోజు ఎన్నికల వాయిదా వేసిన వైనం
భారీ కుట్రలు పన్ని తొర్రురు మున్సిపాలిటీ చైర్మన్ సీటు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ..
తొర్రూర్: రెండు రోజుల హైడ్రామా తరువాత జరిగిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపాలిటీ కోసం జరిగిన ఓటింగ్ లో రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో నిర్వహించిన లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి…
తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థికి సమానంగా ఓట్లు రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల అధికారి డ్రా పద్ధతిలో విజేతను నిర్ణయించారు. డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దాంతో తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్గా తూణం శ్రవణ్ ఎన్నికైనట్లు ప్రకటించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
అరెస్ట్మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ కడియం కావ్య అక్రమంగా ఓటు వేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఎంపీకి అక్రమ ఓటు వేసే హక్కు ఎక్కడిదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మాజీ మంత్రి ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనను నరసింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎర్రబెల్లిని అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కాగజ్ నగర్ కాంగ్రెస్ కైవసం.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాయి..బీజేపీ మద్దతుతో కొమురంభీం జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 09+ బీజేపీ 03+ ఇండిపెండెంట్ 02 + ఇద్దరు ఎక్స్ అఫిషియో లతో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి షాహీన్ సుల్తానా విజయం సాధించారు.