నా అన్వేషణ’ అకౌంట్‌ షాక్​..​ ఇన్​స్టా ఖాతా తొలగింపు..!

వివాదాస్పద యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా తొలగించింది. హిందూ దేవతలను,భారతదేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందున, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యల నేపథ్యంలో నా అన్వేషణ అన్వేష్​పై కేసు నమోదు అయింది. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు Hyderabad CCS police లేఖ రాయడంతో అతడి ఖాతాను మెటా యాజమాన్యం రద్దు చేసింది. దీంతో మిలియన్ల ​ ఫాలోవర్స్​ ఉన్న అన్వేష్​ ఖాతా రద్దు అయింది…

రాటే కళ్యాణి ఫిర్యాదు..

ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ వీడియోలు, రీల్స్​ చేసే అన్వేష్.. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్​తోపాటు హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్వేష్​ వ్యాఖ్యలపై నటి కరాటే కల్యాణి Actress Karate Kalyani ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, భారత్​ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని పేర్కొంటూ హైదరాబాద్ సీసీఎస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్వేష్ అకౌంట్ డిలిట్​ చెయ్యాలని ఇన్‌స్టా నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ మేరకు పోలీసులు తమ లేఖలో ఆధారాలను పొందుపరిచారు. సమాజంలో అశాంతిని పెంచేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అతడి ఇన్​స్టా ఖాతాను వెంటనే తొలగించాలని మెటా యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు మెటా యాజమాన్యం చర్యలు చేపట్టింది. అన్వేష్​ ఖాతాను తొలగించింది.

పోలీసుల నుండి అధికారిక లేఖ అందిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ‘నా అన్వేషణ’ అకౌంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించుకుని, తక్షణమే ఆ అకౌంట్‌ను బ్యాన్ (Ban) చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ అకౌంట్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించడం లేదు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని అధికారులు హెచ్చరిస్తున్నారు.