తెలంగాణలో పండే నాణ్యమైన బియ్యాన్ని రైస్ మిల్లర్లకు అమ్ముతూ కమిషన్లు పొందుతున్నారు… ఎంపి అరవింద్…

నిన్న సీఎం కేసీఆర్ బిజెపి పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన ఎంపీ అరవింద్..ముఖ్యమంత్రి కేసీఆర్ లో ముసుగు వేసుకున్న ఒక స్మగ్లర్ అని… తెలంగాణలో పండే నాణ్యమైన బియ్యాన్ని రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తు ఉన్నారు అని ఆగ్రహించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేయడం లేదని.. అందులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రస్తావన చేస్తాడని ఆగ్రహించారు..రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు స్థల కేటాయింపు జరగలేదని… రీ సైకిల్ బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు ఎఫ్.సి.ఐ కి అమ్ముతున్నారని ఫైర్‌ అయ్యారు. కర్నాటక నుండి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని తెచ్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూ వేల కోట్లు సంపాదిస్తున్నారని.. టీఆర్ఎస్ అండదండలతో మిల్లర్లు ఎక్కువ తరుగు తీసి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు గురించి మాట్లాడకుండా ఎదురుదాడి చేస్తున్నారని…