ఏడుగురు పాకిస్థాన్ సైనికులు బందీలుగా ఉన్నారంటూ వీడియోను విడుదల చేసిన బలూచీస్థాన్ వేర్పాటువాద గ్రూప్..
https://x.com/i/status/2024566625668612096
షేహబాజ్ షరీఫ్ ఫ్రభుత్వానికి వారం రోజులు డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే.అయితే, ఈ వీడియోపై స్పందించిన పాకిస్థాన్.. వాళ్లు తమ సైనికులు కాదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. తమ ఐడీ కార్డులను, పత్రాలను వీడియోకు చూపించిన పాకిస్థానీ సైనికులు… తమను రక్షించాలని అధికారులను వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘మేము వారి సిబ్బంది కాదని ఆర్మీ ఎలా అంటోంది.. ఈ ఐడీ కార్డు ఎవరిది?’ అని సైనిక దుస్తుల్లో ఉన్న ఒకరు ప్రశ్నించారు.
”ఇది పాకిస్తాన్ జారీచేసిన ఐడీ కార్డు.. మేము మీ సిబ్బంది కాదని చెప్పి మాకు అన్యాయం చేయకండి.. నా తండ్రి దివ్యాంగుడు.. మాపై దయ చూపిండి… మీ సైనికులం కాదని చెబుతున్న మీరు ఎందుకు మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నారు? అది ఫేక్ వీడియో అని ఎందుకు అంటున్నారు?” అతడు నిలదీశాడు. ఈ వారం ఓ వీడియోను విడుదల చేసిన బీఎల్ఏ.. ఖైదీల మార్పిడి ఒప్పందంపై పాక్ ప్రభుత్వానికి ఏడు రోజులు గడువు విధించింది. ఆలోగా స్పందించకుంటే.. తమ వద్ద బందీలుగా ఉన్న 8 మంది సైనికులు ప్రాణాలతో ఉండరని హెచ్చరించింది. బీఎల్ఏ విధించిన గడువు ఫిబ్రవరి 22తో ముగియనుండగా… పాక్ వాళ్లు తమ సైనికులు కాదని ప్రకటించింది. దీంతో పాక్ సైనికులు తమ ప్రాణాలకు ఆ దేవుడే దిక్కని వాపోతున్నారు..