విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి సందడి..

టాలీవుడ్‌లో ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి సందడి నెలకొంది. రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఈ నెల 26న వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. వివాహ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లు ఆఫర్ చేసిందని టాక్. ఆఫర్‌ను ఆ జంట తిరస్కరించింది. విజయ్, రష్మిక పెళ్లి సందడి ఫ్యాన్స్‌కు చూపించటానికి రూ.60 కోట్లు ఇస్తామన్నా వారు నో చెప్పారని సమాచారం. వివాహ వేడుకకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఫొటోలు లీక్ కాకుండా చూసేందుకు ఓ విదేశీ సెక్యూరిటీ ఏజెన్సీని రంగంలోకి దించుతున్నారని టాక్. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రహస్యంగా పెళ్లి వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం.

సెలబ్రిటీల పెళ్లి వీడియోల స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు తీవ్రంగా పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ విజయ్-రష్మిక పెళ్లి షూటింగ్ హక్కుల కోసం రూ.60 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఈ క్రేజీ డీల్‌ను వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది.