కర్నాటకలోని శిరహట్టి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమానీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు శనివారం (ఫిబ్రవరి 21) ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరూ పీఏలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఓ రిటైనింగ్ వాల్ నిర్మాణం కాంట్రాక్ట్ కోసం క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్ పూజారి ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమానీని సంప్రదించాడు. రిటైనింగ్ వాల్ కాంట్రాక్ట్ తనకే ఇప్పించాలని కోరాడు. ఇందుకు ఎమ్మెల్యే లమానీ రూ.11లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ విజయ్ పూజారి లోకాయుక్త పోలీసులను ఆశ్రయించాడు.
చెల్లించలేక, ఫిర్యాదుదారుడు లోకాయుక్త పోలీసులను ఆశ్రయించాడు. వారు అవినీతి నిరోధక చట్టం కింద నేరం నమోదు చేసి, ఉచ్చు బిగించి, నిందితులు రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు.
తదుపరి దర్యాప్తు జరుగుతోంది.