నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ..
*రైతు భరోసా, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలపై తేలనున్న నిర్ణయం!*
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ, అభివృద్ధి పరమైన పలు అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పుడు *తదుపరి ఎన్నికలైన GHMC, MPTC, మరియు ZPTC ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.* ఈ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల ఖరారుపై మంత్రుల బృందం చర్చించనుంది. అలాగే, వచ్చే నెల (మార్చి) మొదటి వారంలో ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.