వెంటనే స్వదేశానికి వచ్చేయండి’.. ఇరాన్ లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక !

USA-Iran Tensions: ‘

వెంటనే స్వదేశానికి వచ్చేయండి’..
ఇరాన్ లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక !

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఇరాన్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు లేదా ఇతర ప్రయాణ మార్గాల ద్వారా ఆ దేశాన్ని విడిచిపెట్టి స్వదేశానికి తిరిగి రావాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. ఇరాన్ ప్రభుత్వంపై సొంత పౌరుల నుంచి వ్యతిరేకత వస్తుండటం, దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరుగుతుండటంతో పరిస్థితి అదుపు తప్పింది…అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక లేదా అణు దాడి చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సాయుధ దళాలు ఇప్పటికే మధ్యప్రాచ్యంలో భారీ స్థాయిలో సైనిక మోహరింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరాన్ సైతం ఏ దాడి జరిగినా దీటుగా బదులిస్తామని, ప్రతీకార దాడులకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరూ ఇరాన్ పర్యటనకు వెళ్లవద్దని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది..దీనికి తోడుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక లేదా అణు దాడి చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సాయుధ దళాలు ఇప్పటికే మధ్యప్రాచ్యంలో భారీ స్థాయిలో సైనిక మోహరింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరాన్ సైతం ఏ దాడి జరిగినా దీటుగా బదులిస్తామని, ప్రతీకార దాడులకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరూ ఇరాన్ పర్యటనకు వెళ్లవద్దని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది..