పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు ఐదో రోజు భీకరంగా మారింది. ఒకవైపు టెహ్రాన్ నగరంలో అమెరికా B2 బాంబర్లు మృత్యుఘోష వినిపిస్తుంటే, మరోవైపు ఇరాన్ తన సూపర్ సోనిక్ మిస్సైళ్లతో టెల్ అవీవ్‌ను వణికిస్తోంది. సముద్ర గర్భంలో అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ చేసిన ప్రతీకార దాడితో ఈ యుద్ధం మహా సంగ్రామంగా మారింది…
ఎవర్ని సుప్రీం నాయకుడిని ఎన్నుకున్న చంపేస్తాం: ఇజ్రాయెల్.
అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇంకా ఖననం చేయలేదు. అతని కుమారుడు ముజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలీ ఖమేనీ శుక్రవారం ఖననం చేయనున్నారు. అయితే ఎవరైతే సుప్రీం లీడర్ అవుతారో వారిని చంపుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే ముజ్తబాను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది..
ఇదిలా ఉంటే, తాజాగా కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై ఇజ్రాయిల్ దృష్టి సారించింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎన్నికయ్యే భవనాన్ని కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ నీ కోమ్‌లోని ”అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్” కార్యాలయాన్ని వైమానిక దాడిలో పేల్చింది. ఈ భవనంలోనే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక జరుగుతుంది. ఇజ్రాయిల్ దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైందని..
ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఐడీఎఫ్ సోషల్ మీడియాలో ప్రదర్శించబడింది. ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు ప్రసారాలు. ఇరాన్ అధ్యక్షుడి కార్యాలయం, భదత్రా మండలి భవనాలను కూడా ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. 83 మంది సభ్యులు ఉన్న ”అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్” సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అత్యున్నత మండలి. ఓటింగ్ సమయంలో సభ్యులందరూ అక్కడ లేరని, కొందరు మాత్రం దాడిలో చనిపోయినట్లు ఉన్నారు..