దువ్వాడ శ్రీనివాస్ సహచరి మాధురి మళ్లీ తిరుమలలో అపచారం చేసినట్లు ఆరోపణలు..!

దువ్వాడ శ్రీనివాస్ సహచరి మాధురి మళ్లీ తిరుమలలో అపచారానికి పాల్పడింది. గతంలో రీల్స్ చేసి, తప్పు అయిందంటూ క్షమాపణ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి తప్పు చేసింది. తిరుమలలో లేటెస్ట్ గా చేసిన తప్పుకు, దివ్వెల మాధురి, తనూజ లపై చట్టపరమైన చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దివ్వెల మాధురి, తనూజ నిన్న తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధం. ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. ఇలా చేయడం సరైన పద్ధతి కాదని టిటిడి హెచ్చరించింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది . పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు..