తమిళనాడు మహిళలకు TVK పార్టీ వరాల జల్లు..!

తమిళనాడు మహిళలకు TVK పార్టీ వరాల జల్లు.

మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు..

మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం..

సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం.

ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితం..

మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు.

రేషన్‌ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ.

తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం-విజయ్..

. మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన తన పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలోని కీలక మహిళా గ్యారెంటీలను ప్రకటించారు. మహిళా సంక్షేమం, రక్షణే ధ్యేయంగా అద్భుతమైన పథకాలను ఆయన వివరించారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ.2,500 నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తాం. అంతేకాకుండా, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం’ అని ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన తల్లులకు అండగా ఉండటానికి, 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లల తల్లులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు..

అన్న విజయ్ సాయం’తో పెళ్లి కానుక..

ఆడబిడ్డల పెళ్లి విషయంలో తల్లిదండ్రులపై భారం తగ్గించేందుకు ‘అన్న విజయ్ సాయం’ అనే పథకాన్ని ఆయన ప్రకటించారు. పెళ్లి చేసుకోబోయే యువతులకు 8 గ్రాముల బంగారంతో పాటు పట్టుచీరను ప్రభుత్వం తరపున ఉచితంగా అందజేయనున్నారు. అలాగే, మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రేషన్ షాపుల ద్వారా ఉచితంగా శానిటరీ ప్యాడ్ల పంపిణీ చేపడతామని తెలిపారు.