ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాల నిర్ణయం..

ఈరోజు నుండి ఈ ఫుడ్స్ పెట్టలేం

ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాల నిర్ణయం…

కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని, ఎక్కువ టైమ్ తీసుకునే చపాతీ, పూరి లాంటి వంటకాలు ఉండవని, కొన్ని కూరలు, ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్, సొంతంగా వంట చేసుకోవడానికి వీల్లేదు అంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాల సందేశం..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచమంతా పడుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో నిన్నమొన్నటివరకు బెంగళూరు, ముంబయి, కోల్‌కతా నగరాలపై పడ్డ ప్రభావం తాజాగా హైదరాబాద్‌ను తాకింది. నగరంలోనూ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ప్రభావం పడింది. గత రెండు రోజులుగా గ్యాస్‌ కొరత మూలంగా రాష్ర్ట వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పలు హోటల్స్‌ మూతపడ్డాయి. ఇంకా కొన్ని హోటల్స్‌ రోజువారి మెనూను కుదించి ధరలను పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. తాత్కాలికంగా టీ, కాఫీలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ హోటళ్ల అసోసియేషన్‌ ప్రకటించింది.

ఈరోజు నుండి ఈ ఫుడ్స్ పెట్టలేం

ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు నుంచి కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని, ఎక్కువ టైమ్ తీసుకునే చపాతీ, పూరి లాంటి వంటకాలు ఉండవని, కొన్ని కూరలు, ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్, సొంతంగా వంట చేసుకోవడానికి వీల్లేదు అంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు నోటీసు విడుదల చేసింది. .., ఎక్కువ నూనె వినియోగమయ్యే చపాతి, దోసె, పూరీ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్‌ స్పష్టం చేసింది. చిన్నచిన్న టిఫిన్‌ బండ్లతో పాటు పెద్దపెద్ స్టార్‌ హోటళ్ల దాకా వంటలు చేయడానికి గ్యాస్‌ తప్పనిసరి కావడంతో అయా హోటల్స్‌లో గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే హోటల్స్‌ నడిపే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమవద్ద ఉన్న సిలిండర్లు ఒకట్రెండు రోజులకు మించి నడపలేమని, పరిస్థితి ఇలాగే ఉంటే మూసివేయడం తప్ప మరో మార్గం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, నగరంలో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు లేదా ఎలక్ట్రిక్‌ ఇండక్షన్‌ స్టవ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం లేదని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. .