చింత్రియాల గ్రామంలో తీవ్ర విషాదం..కృష్ణా నదిలోకి దిగిన ఇద్దరు బాలురు గల్లంతు.!

సూర్యాపేట జిల్లా:…

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

గేదలను తీసుకురావడానికి కృష్ణా నదిలోకి దిగిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు.

గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కృష్ణా నదిలోకి దిగగా, తిరిగి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.

ప్రస్తుతం గజ ఈతగాళ్లు కలిసి నదిలో బాలుర కోసం గాలింపు కొనసాగుతోంది.

రంజాన్ మాసం సందర్భంగా సెలవులు ఉండటంతో, ఈ ఇద్దరు బాలురు సమీర్, మరియు సద్దాం,ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని ఉర్దూ మీడియం మదర్సా పాఠశాలలో చదువుతూ స్వగ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో అనుమానం వ్యక్తమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులతో కలిసి కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టగా నేడు ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి దీనితో గ్రామంలో విషయఛాయలు అలుముకున్నాయి..