సోషల్ మీడియా వేదికా కావ్య మారన్‌ను, ఆరెంజ్ ఆర్మీ టీమ్‌ను ట్రోల్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్(Kavya Maran)పై నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విదేశీ లీగే అయినప్పటికీ శత్రుదేశం ఆటగాడిని కొన్నందుకు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫలితంగా బాయ్‌కాట్ సన్‌రైజర్స్(Boycott Sunrisers) హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడమే దీనికంతటికి కారణం..భారత ఫ్రాంచైజీలు పాకిస్థాన్ ఆటగాళ్లను కొనడం మానేసి చాలా రోజులైంది. ఐపీఎల్ ఆరంభంలో వసీం అక్రమ్, సొహైల్ తన్వీర్.. వంటి కొందరికి అవకాశాలిచ్చినా ఆ తర్వాత మాత్రం పాక్ ఆటగాళ్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది బీసీసీఐ. అలాంటిది ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులో దాయాది మిస్టరీ స్పిన్నర్‌కు చోటు దక్కింది. గురువారం జరిగిన ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు కొన్నది..వేలంలో అబ్రార్‌ను లక్షా తొంభై వేల యూరోలకు £190,000 భారతీయ కరెన్సీలో రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కే అబ్రార్‌ను సన్‌రైజర్స్ జెర్సీల చూడాల్సి రావడం కొందరికి నచ్చడం లేదు. అందుకే.. సోషల్ మీడియా వేదికా కావ్య మారన్‌ను, ఆరెంజ్ ఆర్మీ టీమ్‌ను ట్రోల్స్ చేస్తున్నారు..