తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శ్రీ కిరణ్ కుమార్ గన్నమనేని విజయం..!

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శ్రీ కిరణ్ కుమార్ గన్నమనేని విజయాన్ని సాధించారు..

_• ఈరోజు జరిగిన కౌంటింగ్‌లో ఆయన గెలుపు ఖరారైంది. జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల ఫలితాలు గత నెల రోజులుగా కొనసాగిన కౌంటింగ్ అనంతరం ఈరోజు వెల్లడయ్యాయి._

_• శ్రీ కిరణ్ కుమార్ గారు ఇంతకుముందు నాంపల్లి బార్ అసోసియేషన్‌లో సెక్రటరీగా, అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు._

_• విజయం అనంతరం మాట్లాడిన ఆయన, అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా అడ్వకేట్ల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఇతర బార్ కౌన్సిల్ సభ్యులతో కలిసి ‘అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ సాధన దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు._

_• తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ కిరణ్ కుమార్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు._