అమెరికా శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ ఆగ్రహం ఇరాన్‌కు 15 పాయింట్లను ప్రతిపాదించిన అమెరికా అమెరికా ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవు-ఇరాన్‌..

అమెరికా శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ ఆగ్రహం
ఇరాన్‌కు 15 పాయింట్లను ప్రతిపాదించిన అమెరికా
అమెరికా ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవు-ఇరాన్‌..

అమెరికా ఒకవైపు చర్చలు అంటూనే..
ఇరాన్ సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోంది..

అమెరికా సైనికుల కదలికలను నిశితంగా గమనిస్తున్నాం..-ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాకర్ ఖలీబాఫ్..

తమ షరతులకు ఒప్పుకొంటే, ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తేస్తామని, విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్వహణకు ఆర్థిక సాయం చేస్తామని ప్రతిపాదించారు. అయితే అమెరికా ప్రతిపాదనను సమీక్షించిన ఇరాన్‌ షరతులు తమకు ఆమోదయోగ్యంగా లేవని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదనకు తమ ప్రాథమిక స్పందన సానుకూలంగా లేదని, అయినప్పటికీ షరతులపై సమీక్ష కొనసాగుతుందని ఇరాన్‌ అధికారి ఒకరు రాయిటర్స్‌ వార్తాసంస్థకు తెలిపారు..

యుద్ధం ఎప్పుడు ముగించాలో నిర్ణయం తీసుకునే అధికారం ఇరాన్‌కు మాత్రమే ఉందని ఆ అధికారి స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు సమయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్దేశించడానికి ఇరాన్‌ అనుమతించదని ఆయన తెగేసి చెప్పారు. కొన్ని షరతులు పూర్తిగా నెరవేరినపుడు మాత్రమే దాడులను ఆపడానికి అంగీకరిస్తామని ఆయన తెలిపారు. సహజ న్యాయ హక్కు అయిన హొర్ముజ్‌ జలసంధిపై తమ దేశానికి సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని, యుద్ధ నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో, చెప్పాలని వంటి కొన్ని కీలక డిమాండ్లను ఇరాన్‌ తెరపైకి తెచ్చింది.

భవిష్యత్తులో యుద్ధం పునరావృతం కాకుండా పటిష్టమైన హామీలు ఇవ్వాలని, ఈ యుద్ధానికి మాత్రమే కాకుండా ప్రాంతంలోని తిరుగుబాటు బృందాలతో ముడిపడి ఉన్న ఘర్షణలకు కూడా ముగింపు పలకాలని తాము కోరుకుంటున్నట్లు ఇరాన్‌ తెలిపింది. తమ షరతులు నెరవేరే వరకు తమ ఆత్మరక్షణ చర్యలు కొనసాగుతాయని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమ షరతులకు ఒప్పుకొంటే, బాలిస్టిక్‌ క్షిపణుల అభివృద్ధి ప్రక్రియను ఐదేండ్లపాటు నిలిపేయడంతో పాటు యురేనియం నిల్వల పెంపును తగ్గించడం, ఐఏఈఏకు పర్యవేక్షణ అధికారాలు అప్పగించడం, ప్రాంతీయ శక్తులకు నిధులను ఇవ్వడాన్ని నిలిపివేయడం వంటి అమెరికా కండీషన్లకు ఒప్పుకొంటామని ఇరాన్‌ పేర్కొన్నది..

ఇరాన్‌కు అమెరికా విధించిన షరతులు
1. ఇరాన్‌ భూభాగంపై అణుశుద్ధి జరుగకూడదు.

2. ఇరాన్‌లో ఇప్పటికే ఉన్న అణ్వాయుధ కేంద్రాలను నాశనం చేయాలి.

3. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో పాక్షికంగా ధ్వంసమైన నతాంజ్‌, ఇస్ఫహాన్‌, ఫోర్దోలో ఉన్న అణు కేంద్రాలను ఇరాన్‌ పూర్తిగా నేలమట్టం చేయాలి.

4. అణ్వాయుధాలను ఎప్పటికీ సమకూర్చుకోబోమని ఇరాన్‌ హామీ ఇవ్వాలి.

5. ఇరాన్‌ తన దగ్గర ఉన్న 450 కిలోల యురేనియం నిల్వలను ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ)కి అప్పగించాలి.

6. హొర్ముజ్‌ జలసంధిని తెరవాలి.

7. హొర్ముజ్‌ను ఫ్రీ మారిటైమ్‌ కారిడార్‌గా నిర్వహించాలి.

8. క్షిపణి కార్యక్రమాలను పరిమితం చేయాలి..

9. క్షిపణిల పరిధి, సంఖ్యను తగ్గించుకోవాలి.

10. క్షిపణులను ఏ మేరకు సామర్థ్యంతో వినియోగించుకోవాలో తర్వాత తెలియజేస్తాం. దానికి ఒప్పుకోవాలి.

11. ఆత్మరక్షణ కోసం మాత్రమే క్షిపణులను వినియోగించుకోవాలి.

12. ఇరాన్‌కు సంబంధించిన రక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించే అనుమతులను ఐఏఈఏకు ఇవ్వాలి.

13. ప్రాంతీయ శక్తులతో (హెజ్‌బొల్లా, హౌతీలు) అంటకాగడాన్ని ఇరాన్‌ విడిచిపెట్టాలి.

14. ప్రాంతీయంగా తనకు అనుబంధంగా పనిచేస్తున్న వారికి (హెజ్‌బొల్లా, హౌతీలు) నిధులు, ఆయుధాలు ఇవ్వడాన్ని వెంటనే నిలిపేయాలి.

15. ప్రాంతీయ శక్తులకు ఇరాన్‌ దిశానిర్దేశం చేయకూడదు…

అమెరికాకు ఇరాన్‌ విధించిన షరతులు.

1. మాపై దాడులు చేయబోమని అమెరికా హామీనివ్వాలి.

2. భవిష్యత్తులో కూడా హొర్ముజ్‌ జలసంధి ఇరాన్‌ నియంత్రణలోనే ఉంటుందని హామీ ఇవ్వాలి.

3. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ మూసేయాలి.

4. యుద్ధంలో నష్టపోయిన దానికి పూర్తి పరిహారం చెల్లించాలి.

5. ఈ ప్రాంతంలోని రెసిస్టెన్స్‌ గ్రూప్‌లపై దాడులను నిలిపివేయాలి.
పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతోన్న యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. తమ దాడులకు ట్రంప్ భయపడ్డారని, అమెరికా, ఇజ్రాయెల్‌లు చిత్తుగా ఓడిపోయాయని ఇరాన్ ఎద్దేవా చేసింది. అయితే, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమయం చూసి మళ్లీ తమపై దాడులు చేసేందుకే ట్రంప్ ప్లాన్ చేశారని, ఆయన నమ్మబోమని ఇస్లామిక్ రిపబ్లిక్ తేల్చిచెప్పింది..