ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం..

ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం..

టిప్పర్ లారీని ఢీకొని పూర్తిగా దగ్ధమైన బస్సు, 10 మంది సజీవ దహనం..

మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన బస్సు, లారీ.

ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కాగా, బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం

బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు...

మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయని తెలుస్తోంది. బస్సు, లారీ ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం జరిగింది. రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి..ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బాధితులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా నెల్లూరుకు బస్సు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు చీమకుర్తి నుంచి కంకర తీసుకొస్తున్న టిప్పర్ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తి దగ్ధమయ్యాయి. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 10 మంది కాలిబూడిదయ్యారు. మరో 12 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా, దాదాపు 20మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు..

మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం చాలా బాధాకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి.

రోడ్డు ప్రమాదాల వల్ల నిండు ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదంగా ఉంటుంది.. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు.

ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించాలని సూచన.. మృతుల సంఖ్య పెరగొచ్చనే వార్తలు కలచివేస్తున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన..