ఈ ఆపరేషన్ కోసం భారత నౌకాదళం ఐదు కంటే ఎక్కువ అత్యాధునిక యుద్ధనౌకలను (డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు) గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో మోహరించింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చమురు, గ్యాస్‌ను తీసుకువస్తున్న నౌకలు క్రమంగా భారత్ తీరాలకు చేరుకుంటున్నాయి.
దేశానికి అవసరమైన ఇంధన సరఫరాలను భద్రంగా కొనసాగించేందుకు భారత నౌకాదళం కీలక చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో ‘ఆపరేషన్ ఊర్జా సురక్షా’ను ప్రారంభించి, చమురు మరియు ఎల్పీజీ నౌకలను హర్మూజ్ జలసంధి దాటించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఈ ఆపరేషన్‌పై వివరాలను కొన్ని అంతర్జాతీయ ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి…
హోర్ముజ్ జలసంధి గుండా బయటకు వచ్చే ముడి చమురు (Crude Oil), ఎల్పిజి (LPG), మరియు ఎల్ఎన్జి (LNG) నౌకలకు ఈ యుద్ధనౌకలు ఎస్కార్ట్ (రక్షణగా వెంట వెళ్లడం) ఇస్తాయి..
ప్రపంచ చమురు వాణిజ్యంలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన ‘చోక్ పాయింట్’ (Chokepoint)..
భారత్‌కు అవసరమైన ముడి చమురు, గ్యాస్‌లో సింహభాగం పశ్చిమ ఆసియా నుంచి ఈ మార్గం ద్వారానే వస్తుంది..
ఇక్కడ రవాణాకు ఆటంకం కలిగితే దేశంలో ఇంధన ధరలు పెరగడమే కాకుండా, రవాణా, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
భారత నౌకాదళం కార్గో నౌకలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, వాటిని సురక్షిత మార్గాల ద్వారా అరేబియా సముద్రం వైపు నడిపిస్తుంది.
రియల్ టైమ్ మానిటరింగ్: నౌకల కదలికలను నిరంతరం పర్యవేక్షించడం.
ముప్పుల నుంచి రక్షణ: సముద్రపు గనుల (Mines) నుంచి లేదా శత్రు దేశాల దాడుల నుంచి నౌకలకు రక్షణ కల్పించడం.
సేఫ్ రూటింగ్: ప్రమాదకరమైన జోన్ల నుంచి నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం.
సముద్ర మార్గంలో అత్యంత ఇరుకైన, కానీ వాణిజ్యపరంగా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలను ‘చోక్ పాయింట్లు’ అంటారు.
ఉదాహరణలు: హార్ముజ్ జలసంధి, మలక్కా జలసంధి, సూయజ్ కాలువ.
ఆపరేషన్ పేరు: ఆపరేషన్ ఊర్జా సురక్ష.
నిర్వహిస్తున్న సంస్థ: భారత నౌకాదళం (Indian Navy).
లక్ష్యం: ఇంధన సరఫరా నౌకలకు (Oil, LPG, LNG) రక్షణ కల్పించడం.
ప్రాంతం: హార్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్.
ప్రస్తుత పరిస్థితి: సుమారు 20 నౌకలు యుద్ధ ఉద్రిక్తతల వల్ల చిక్కుకుపోవడంతో ఈ మిషన్ ప్రారంభమైంది.
సీమైన్స్ ముప్పు.. నేవీ ప్రత్యేక మార్గాల గుర్తింపు
సాధారణంగా సముద్ర ప్రయాణం హైడ్రోగ్రాఫిక్ చార్ట్‌లు మరియు నావిగేషన్ వ్యవస్థల ఆధారంగా జరుగుతుంది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో హర్మూజ్ సమీపంలో ఇరాన్ సీమైన్స్‌ను అమర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సీమైన్స్‌లో చాలా భాగం బయటకు కన్పించకపోవడం వల్ల నౌకలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్ చార్ట్‌లను సిద్ధం చేస్తోంది.
నిఘా నౌకలతో సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి సురక్షిత మార్గాలను గుర్తిస్తోంది.
ఆ మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని హర్మూజ్ జలసంధి నుంచి సురక్షితంగా దాటిస్తోంది…