దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం..!

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగనుంది…

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఆ ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రత, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రభావం వంటి అంశాలపై ప్రధాని సీఎంలతో చర్చించనున్నారు..

అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు, సమన్వయం ఎలా ఉండాలి అన్నదానిపై కూడా మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది..

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది.. గల్ఫ్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.. దీంతో యుద్ధం ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది.. ముఖ్యంగా గ్యాస్, చమురు సరఫరా తగ్గడంతో పలు దేశాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.. ముఖ్యంగా భారత్ లో సైతం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది.. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మోదీ.. పశ్చిమాసియా పరిస్థితులతోపాటు.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై కూడా సీఎంలతో నేరుగా మాట్లాడనున్నారు. అయితే.. ఈ సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడనున్నారనేది ఉత్కంఠగా మారింది.