శ్రీనగర్‌లోని ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్లో నిండుగా వికసించిన తులిప్ పువ్వులు; పర్యాటకుల తాకిడి..
శ్రీనగర్‌లోని ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్లో నిండుగా వికసించిన తులిప్ పువ్వులు; పర్యాటకుల తాకిడి…
జమ్మూకశ్మీర్: ఆసియాలోనే అతిపెద్దదైన శ్రీనగర్‌లోని ‘ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్’ ఈ ఏడాది తెరుచుకుంది..

ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్:
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఇవాళ(మార్చి 23) పర్యాటకుల కోసం తెరుచుకుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను శనివారం పర్యాటకుల సందర్శన కోసం తెరిచినట్లు అధికారులు తెలిపారు.
ఈసారి 70 రకాలకు చెందిన 18 లక్షల బల్బులను నాటారు. అవి వివిధ రంగుల్లో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సందర్శకుల కోసం ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటకుల్లో ఉత్సాహం నింపేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు..