ఢిల్లీ చేతిలో ఓటమి.. ఓనర్ సంజీవ్ గోయెంకా,, పంత్ కు వేలు చూపిస్తూ వార్నింగ్..!!

ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs DC) ఓటమితో ఆరంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో లక్నో ఓడింది. 2022 నుంచి ఐపీఎల్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ గత రెండు సీజన్లలోనే పేలవ ప్రదర్శన చేసింది. ఇక తాజా సీజన్‌ను కూడా ఓటమితో ఆరంభించింది..తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్సర్), మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. వీరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కెప్టెన్ రిషభ్ పంత్ (7) దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ , కోచ్ జస్టిన్ లాంగర్‌తో చిట్ చాట్ చేశాడు. గోయెంకా తాను కామ్ అండ్ కూల్ అయ్యానని చెప్పినా సరే.. మ్యాచ్ ఓడిపోతే వచ్చే అసహనం మళ్లీ ఆయనలో కనిపించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్‌తో చేసిన బిహేవియరే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో కూడా పంత్‌తో ఒకట్రెండ్ సార్లు సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇదంతా గ్రౌండ్ లోపలే జరుగుతుండటమే విమర్శలకు ప్రధాన కారణంగా నిలుస్తుంది.

ఈ సీజన్‌లో ఢిల్లీపై ఓటమి తర్వాత కూడా పంత్, లాంగర్‌తో సంజీవ్ గోయెంకా డిస్కషన్ చేశాడు. మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు, తప్పొప్పులపై మాట్లాడుతున్న సమయంలో సంజీవ్ గోయెంకా కాస్తంత సహనం కోల్పోయాడంటూ కొందరు నెట్టింట ఫొటోలు పోస్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. రిషభ్ పంత్ కూడా సీరియస్‌గానే తానేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపించింది..