జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు చేసిన ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ఎమ్మెల్యే అనుచరులు .
అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన వేళ.. రైల్వేకోడూరులో బీభత్సం జరిగినట్టు తెలుస్తోంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసుల ముందే, వారి చేతిలోని లాఠీలను లాక్కొని మరీ జనసేన నాయకులు దౌర్జన్యం చేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఒక మహిళపై, ఆమెతో ఉన్న వ్యక్తిపై నడిరోడ్డుపై జరిగిన ఈ దాడి.. రేపు మరెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తోంది..
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు…