చెన్నూర్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదు.
సంధ్యారాణి ఘనవిజయం..
గత కొన్ని రోజులుగా హైటెన్షన్ మధ్య కొనసాగిన క్యాతనపల్లి మున్సిపల్ పీఠం ఎట్టకేలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ వశమైంది. ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గొడిసల సంధ్యారాణి ఘనవిజయం సాధించారు. మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో ఆమె మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. కేవలం ఛైర్మన్ పదవినే కాకుండా, వైస్ చైర్మన్ పదవిలోనూ విపక్ష కూటమి పట్టు సాధించింది.