టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు రాజీనామా కోరుతూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు…

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.. గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ అంశంగా మారిపోయిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ పాలనలో టీటీడీలో అరాచకాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. టీటీడీ నెయ్యి కల్తీ, పరాకమణీ దొంగతనాలు, ధార్మిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఇలా ప్రతీ అంశంలోనూ జగన్ ను వేలెత్తి చూపుతోంది. ఈ క్రమంలో అనివార్యంగా శ్రీవారి ఆలయంలో రాజకీయంగా చర్చల్లో నిలుస్తూనే వచ్చింది. అయితే తాజాగా టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు రాజీనామా కోరుతూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో మళ్లీ శ్రీవారి ఆలయం చర్చల్లోకి వచ్చింది…

టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇటీవల వైసీపీ పార్టీ విస్తృత స్థాయిలో వైరల్ చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పదవికి తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలకు దిగారు. అనైతిక చర్యలతో శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్న బీ.ఆర్. నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం బీ.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తూ.. ఆయన్ను ఇంకా పదవిలో కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.