పొనుగోడు పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో స్టేషనరీ సామగ్రి పంపిణీ….

సూర్యాపేట జిల్లా.. పొనుగోడు పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు గుండ్రెడ్డి సైదిరెడ్డి అధ్యక్షతన MPPS పొనుగోడు పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, స్టేషనరీ సామగ్రి మరియు పెన్నులు క్లబ్ మాజీ అధ్యక్షులు కందిబండ శ్రీనివాస్ ఆర్థిక సహకారం తో ఈరోజు అందజేయడం జరిగింది…
ఈ సందర్భంగా గుండ్రెడ్డి సైదిరెడ్డి, కందిబండ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడం లయన్స్ క్లబ్ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు కందిబండ శ్రీనివాస్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెవ్వ వెంకటరెడ్డి,ఉపాధ్యాయులు బసవకోటేశ్వరరావు, సందీప్, ఉపాధ్యబృదం ,తదితరులు పాల్గొన్నారు .